Radhe Shyam : ప్రభాస్ సినిమాలోని ఆ సీన్ కోసం రూ.50 కోట్లా ?

October 20, 2021 4:14 PM

Radhe Shyam : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతో మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది.

Radhe Shyam one scene in this movie cost them for rs 50 crores

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి చిత్రబృందం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 15 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఈ సన్నివేశానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సన్నివేశం కోసం చేసిన ఖర్చులు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆతృత పడుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now