Raasi : ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశి. తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు సినిమాతో రాశి తెలుగు తెరకు పరిచయమయ్యింది. సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిగా అనిపించిన నటీమణి రాశి. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషల్లోనూ రాశి అందాలు ఆరబోసింది. అగ్ర దర్శకులతో పనిచేసిన రాశి.. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే గ్లామర్ రోల్స్ తో కూడా అల్లాడించింది.
అయితే తెలుసో తెలియకో రాశి చేసిన ఓ తప్పు తన అభిమానులను బాధపెట్టింది. రాశి హీరోయిన్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్.. కొన్ని వల్గర్ రోల్స్ చేసి తన పరువు తానే తీసుకుంది. ఆమె నిజం సినిమాలో గోపీచంద్ తో చేసిన రొమాన్స్.. ఆ హాట్ రోల్ అభిమానులకు నచ్చలేదు. ఎందుకు రాశి ఇలా చేసిందా అంటూ ప్రశ్నించేలా చేసుకుంది. దీనిపై రాశి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తనకు డైరెక్టర్ తేజ కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్పాడని సినిమా తెరకెక్కించేటప్పుడు మరోలా తీశాడని.. ఎడిటింగ్ లో మొత్తం తీసేశారని.. ఆ విషయంలో తేజ నన్ను మోసం చేశాడని.. బాగా ఎమోషనల్ అయింది రాశి. ప్రస్తుతం డైరెక్టర్ తేజ కెరీర్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. దీంతో రాశి ఉసురు వల్లే తేజ కెరీర్ నాశనమైంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆడదాన్ని ఏడిపించిన ఉసురు ఊరికే పోదు అంటున్నారు ఇంకొందరు. ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ను బిజీగా మల్చుకుంది. పలు సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో చేస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…