Raasi : డైరెక్ట‌ర్ తేజ.. రాశిని మోసం చేశాడా.. అందుక‌నేనా ఇప్పుడు దీన‌స్థితిలో ఉన్నాడు..?

September 20, 2022 12:06 PM

Raasi : ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశి. తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు సినిమాతో రాశి తెలుగు తెరకు పరిచయమయ్యింది. సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిగా అనిపించిన నటీమణి రాశి. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషల్లోనూ రాశి అందాలు ఆరబోసింది. అగ్ర దర్శకులతో పనిచేసిన రాశి.. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే గ్లామర్ రోల్స్ తో కూడా అల్లాడించింది.

అయితే తెలుసో తెలియకో రాశి చేసిన ఓ తప్పు తన అభిమానులను బాధపెట్టింది. రాశి హీరోయిన్‌గా చేస్తూనే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్.. కొన్ని వల్గర్ రోల్స్ చేసి తన పరువు తానే తీసుకుంది. ఆమె నిజం సినిమాలో గోపీచంద్ తో చేసిన రొమాన్స్.. ఆ హాట్ రోల్ అభిమానులకు నచ్చలేదు. ఎందుకు రాశి ఇలా చేసిందా అంటూ ప్రశ్నించేలా చేసుకుంది. దీనిపై రాశి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

Raasi sensational comments on director teja
Raasi

తనకు డైరెక్టర్ తేజ కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్పాడని సినిమా తెరకెక్కించేటప్పుడు మరోలా తీశాడని.. ఎడిటింగ్ లో మొత్తం తీసేశారని.. ఆ విషయంలో తేజ నన్ను మోసం చేశాడని.. బాగా ఎమోషనల్ అయింది రాశి. ప్రస్తుతం డైరెక్టర్ తేజ కెరీర్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. దీంతో రాశి ఉసురు వల్లే తేజ కెరీర్ నాశనమైంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆడదాన్ని ఏడిపించిన ఉసురు ఊరికే పోదు అంటున్నారు ఇంకొందరు. ప్రస్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ను బిజీగా మల్చుకుంది. పలు సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now