PV Sindhu : ఆ స్టార్ హీరోపై మనసు పారేసుకున్న పీవీ సింధు.. ఆయన అంటే పిచ్చి ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్..

August 23, 2022 9:49 PM

PV Sindhu : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె అందుకున్న పతకాలు భారతదేశ ఖ్యాతిని పెంచాయి. ఇటీవల కామన్‌వెల్త్‌ 2022 గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి ప్రతిష్టాత్మక పోటీల్లో స్వర్ణం గెలుపొందిన తొలి తెలుగు తేజంగా కీర్తి పొందింది. తాజాగా పీవీ సింధు ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన ఫేవరేట్‌ హీరో, తనకు వచ్చిన ప్రేమలేఖలు వంటి తదితర ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇక షోలో ఆలీతో సింధు బాగానే సందడి చేసినట్లు కనిపిస్తోంది. ఆలీ మీకు న‌చ్చిన హీరో ఎవ‌ర‌ని అడిగితే చాలామంది హీరోలు న‌చ్చుతారు అని స‌మాధానం ఇచ్చింది సింధు. వెంటనే ఆలీ ఎవ‌రైనా ఒక‌రి పేరు చెప్పు అనడంతో ప్ర‌భాస్ అని చెప్పింది సింధు. ఇక మేమిద్ద‌రం చాలా మంచి స్నేహితులం అని కూడా చెప్పింది. దీంతో అలీ ఏంటి ఇద్దరు ఒక‌టే హైట్ అని ఇష్ట‌మా అంటూ సరదాగా కామెంట్ చేయడంతో సింధు తెగ నవ్వింది. భవిష్యత్తులో హీరోయిన్‌ అయ్యే అవకాశం ఉందా ? అన్న అప్రశ్నకు ఏమో.. నా బయోపిక్‌ కూడా ఉండొచ్చేమో ! అంటూ ఆసక్తికరమైన‌ సమాధానం ఇచ్చింది పీవీ సింధు.

PV Sindhu told about her favorite telugu actor
PV Sindhu

అలాగే తనకు చదువుకునే రోజుల నుంచే లవ్ లెటర్లు వచ్చేవంటూ.. మా ఫ్యామిలీ మెంబర్సే అవి చదువుతారని నవ్వుతూ చెప్పింది. ఒకానొక సమయంలో 70 ఏళ్ల వ్యక్తి ప్రేమలేఖ రాసి, తనను పెండ్లి చేసుకోకపోతే కిడ్నాప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. మెడల్ తీసుకునేప్పుడు చేతిలో మన జాతీయ జెండా ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్‌ ఎలా ఉంటుంది ? అని ఆలీ అడిగిన ప్రశ్నకు.. విదేశాల్లో మన జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు నాకైతే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి అని ఎమోషనల్ అయ్యింది సింధు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment