Wealth : మన చుట్టూ పరిసరాల్లో దానిమ్మ చెట్లు ఎక్కడ చూసినా పెరుగుతుంటాయి. ఇవి ఎలాంటి నేలలో అయినా సరే సులభంగా పెరుగుతాయి. వీటిని పెంచేందుకు పెద్దగా నీళ్లు కూడా అవసరం లేదు. దానిమ్మ పండ్లను తింటే మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దానిమ్మ చెట్టు కొమ్మలకు ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అనేక యంత్రాలను వీటితోనే రాస్తారు. కనుక దానిమ్మ కొమ్మలు మనకు అదృష్టాన్ని, సంపదను తెచ్చి పెడతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ కొమ్మలను ఎలా ఉపయోగిస్తే మనకు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ చెట్టులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందట. కనుక ఈ చెట్టు కొమ్మలను తెంచే ముందు చెట్టుకు ఒక సారి నమస్కారం చేయాలి. ఆ లక్ష్మీదేవిని క్షమించని కోరాలి. తరువాత కొమ్మలను తెంచాలి. తెంచేటప్పుడు ఆ కొమ్మలను ఏ పని కోసం ఉపయోగించబోతున్నామో చెప్పాలి. ఇక ఈ కొమ్మలను ఫల్గుణి నక్షత్రం రోజున తెంచి ఎర్రని వస్త్రంలో చుట్టాలి. అనంతరం పూజ గదిలో ఉంచి పూజలు చేయాలి. తరువాత కొమ్మలు ఉన్న ఆ వస్త్రాన్ని అలాగే బీరువాలో పెట్టాలి. దాని దగ్గర ఇతర ఏ వస్తువులను కూడా ఉంచరాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలన్నీ పోతాయి. అదృష్టం కలసి వస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు పోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
ఇక శనివారం రోజు స్వాతి నక్షత్రం వచ్చిన రోజు ఈ కొమ్మలను తెంచి వాటిని బియ్యంతో కలిపి పూజ చేసి అనంతరం వాటికి నల్లదారం కట్టి మన శరీరానికి కట్టుకోవాలి. ఇలా చేస్తే దుష్టశక్తుల పీడ ఉండదు. అలాగే దిష్టి కూడా పోతుంది. మనపై ఉండే చెడు ప్రభావం అంతా తగ్గుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే నెమ్మదిగా తగ్గుతాయి. అలాగే మనపై ఉండే దోషాలు కూడా పోతాయి.
ఇక గురువారం రోజు ఈ కొమ్మలను తెంచి పసుపు రంగు వస్త్రంలో చుట్టి, పసుపు రంగు తీపి వంటకం చేసి పూజ చేయాలి. తరువాత ఆ వస్త్రాన్ని విద్యార్థుల బ్యాగులు లేదా పుస్తకాల్లో ఉంచాలి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, తెలివితేటలు వస్తాయి. ఇలా దానిమ్మ కొమ్మలను ఉపయోగించి మనం లాభాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…