Ashu Reddy : బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియా యూజర్లకు తెలుసు. అందులో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ను అందులో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తన అందాల ఆరబోత ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. దీంతో అవి వైరల్ అవుతుంటాయి. అషు రెడ్డి గ్లామర్ షోకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఈమెకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈమె పెట్టే పోస్టులు ట్రెండ్ అవుతుంటాయి.
ఇక అషు రెడ్డి కూడా ఇతర యాంకర్ల లాగానే ఏమీ దాచుకోకుండా గ్లామర్ షో చేస్తుంటుంది. ఈమె చూసేందుకు సమంతలా ఉంటుంది. కనుకనే అప్పట్లో టిక్‌టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయింది. ఈమెను జూనియర్ సమంత అని కూడా పిలుస్తుంటారు. అలా పాపులర్ అయిన ఈమె బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. కానీ అందులో ట్రోఫీని లిఫ్ట్ చేయలేకపోయింది. ఇక మళ్లీ ఈమెకు బిగ్ బాస్ ఓటీటీలోనూ చాన్స్ వచ్చింది. అయితే ఫినాలేకు దగ్గర్లో ఉన్నప్పుడు ఈమె అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. తరువాత బయటకు వచ్చి తన గ్లామర్ షో డోసు పెంచింది. రెచ్చగొట్టే పోజులతో ఫొటోలు దిగుతూ వాటిని షేర్ చేస్తోంది. అయితే అషు రెడ్డిని ప్రస్తుతం నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్నానం చేయమ్మా ముందు.. కంపు వాసన వస్తోంది.. అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో పాల్గొన్న అజయ్‌తో కలిసి అషు రెడ్డి ఓ రీల్ చేసింది. మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌ను చెప్పింది. కాలం మారిపోయి పద్ధతులు మారాయి.. కానీ నాకే కనుక స్వయం వరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవారో తెలుసా ? అనే డైలాగ్‌ను అషు రెడ్డి రీల్‌గా చెప్పింది. అనంతరం దీన్ని పోస్ట్ చేసింది. అయితే దీనికి భారీగా రెస్పాన్స్ వస్తుందని ఆశించింది. అనుకున్నట్లే స్పందన కూడా వస్తోంది. కానీ నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అషు రెడ్డి వీడియోపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అషు రెడ్డి ఈ వీడియోను పోస్ట్ చేసి కామెంట్స్ పెట్టమని కోరింది. అంతే.. నెటిజన్లు తమ నోళ్లకు పని చెప్పారు. ఆమెను ఇష్టానుసారంగా తిట్టిపోస్తున్నారు. నీ ప్లాస్టిక్ సర్జరీ ముఖం కోసం గుర్రాలేసుకుని ఎవడు వస్తాడు.. అసలు నువ్వు ముందు స్నానం చెయ్యి.. కంపు వాసన వస్తోంది.. నువ్వు బాగా ఊహించుకోకు.. అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో అషు రెడ్డికి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. దీనిపై ఆమె మళ్లీ ఏమైనా పోస్టు పెడుతుందేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…