Ileana : దేవదాసు చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు.. సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది.. గోవా బ్యూటీ ఇలియానా. తరువాత సూపర్ స్టార్ మహేష్ పక్కన పోకిరి సినిమాలో నటించింది. దీంతో ఇల్లీ బేబీ దశ తిరిగిపోయింది. వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ అమ్మడు లవ్‌లో పడి సినిమాలను పట్టించుకోలేదు. దీంతో లవ్ బ్రేకప్ అయ్యాక.. చేయడానికి పనిలేదు. ఈ క్రమంలోనే ఈమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తరువాత ఎలాగో దాని నుంచి బయట పడి మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కానీ ఆమెలో మునుపటి గ్లామర్ లేదు. పైగా లావుగా అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు అంతగా రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో నటించినా.. అవి ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇలియానా సినిమా కెరీర్ ఇక ముగిసినట్లే అని తెలుస్తోంది.
అయితే ఇలియానా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామరస్ ఫొటోలను ఆమె అందులో షేర్ చేస్తోంది. కాగా ఈమె గతంలో బరువు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మళ్లీ సన్నగా మారింది. ఈ క్రమంలోనే వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ బికినీ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలు చూసి యువత పిచ్చెక్కిపోతున్నారు. అయితే ఇలియానా తాజాగా పసుపు రంగు డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది. కానీ ఈ ఫొటోల్లో ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేకుండా ఉంది. ఒక్కసారిగా చూస్తే అసలు ఈమె ఇలియానాయేనా.. అనిపిస్తోంది. అంతలా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. దీంతో ఇలియానా కొత్త లుక్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక ఈమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఆమెకు ఏమైంది.. అని ఆరా తీస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిసారిగా ది బిగ్ బుల్ అనే మూవీలో నటించింది. ఈమె హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే చిత్రం షూటింగ్ పూర్తి కాగా.. ఇంకో మూవీలోనూ నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…