Viral Video : మనలో చాలా మందికి దోశలు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకనే తరచూ రకరకాల దోశలను తింటుంటారు. ఆనియన్ దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, పెసరట్టు.. ఇలా రకరకాల దోశలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొందరు వీటిని ఇళ్లలోనే చేసుకుంటుంటారు. కానీ కొందరు వీటిని తినేందుకు బయటకు వెళ్తుంటారు. అయితే ఇంట్లో కన్నా బయట అందించే దోశలు కాస్త రుచిగానే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బయట హోటల్స్‌లో కన్నా రహదారుల పక్కన పెట్టే తోపుడు బండ్లపైనే దోశలు భలే రుచిగా ఉంటాయి. మొన్నా మధ్య లలితా జువెలర్స్ యజమాని కూడా ఇలాగే రహదారి పక్కన బండిపై దోశలను తిని అందరినీ షాక్ కు గురి చేశారు. అయితే దోశలు తినేందుకు ఎక్కడికైనా వెళ్లండి.. కానీ అక్కడికి వెళితే.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ దోశలు వేసే మాస్టర్ అల్లాటప్పా వ్యక్తి కాదు. దోశ వేసి నేరుగా మీ ప్లేట్‌లోకే విసురుతాడు. అవును.. దాన్ని పట్టుకుని తినాలి. లేదంటే మిస్ అవుతారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ముంబైలోని దాదర్ ఈస్ట్ అనే ప్రాంతంలో హింద్ మాతాలోని ముత్తు దోశ సెంటర్లో ఓ దోశ మాస్టర్ పనిచేస్తున్నాడు. అయితే ఆయనకు వికెట్ కీపర్ దోశావాలా అనే పేరుంది. ఎందుకంటే ఆయన దోశ వేశాక నేరుగా మన ప్లేట్‌లోకే విసిరేస్తాడు. పద్ధతిగా మనకు ప్లేట్‌లో పెట్టి ఇవ్వరు. అయినప్పటికీ ఆయన దోశ వేసి విసరగానే నేరుగా వచ్చి ప్లేట్‌లోనే పడుతుంది. బయట పడదు. అదీ ఆయన స్పెషాలిటీ. ఈ క్రమంలోనే ఆయన దోశలు అలా వేస్తూ ప్లేట్‌లోకి వాటిని విసురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ దోశ మాస్టర్ టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. దోశలను ఇలా కూడా విసరొచ్చా.. అని షాకవుతున్నారు.
కాగా ఆ దోశ సెంటర్ అక్కడ ఎంతో ఫేమస్. ఆ మాస్టర్ తయారు చేసే దోశలను తినేందుకు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ రకరకాల దోశలు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక మీరు ఎప్పుడైనా ముంబై వెళ్లినా.. లేదా అక్కడే ఉంటున్నా.. ఒక్కసారి ఆ దోశలను ట్రై చేయండి. మరిచిపోకండి..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…