Pushpa : పుష్ప మూవీలో సునీల్‌ లుక్‌.. అదిరిపోయిందంతే..!

November 7, 2021 1:22 PM

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల అయ్యి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Pushpa  sunil look is wonderful poster launched

డిసెంబర్ 17న సినిమా విడుదల చేయనున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ మంగళం సీను పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సునీల్‌ భిన్నమైన లుక్‌ లో కనిపిస్తుండడం విశేషం. సునీల్‌కు చెందిన ఈ లుక్‌ అదిరిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

 ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి. ఇందులో అనసూయ కీలకపాత్రలో సందడి చేయనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక డి గ్లామర్ లుక్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో భారీ మాస్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం సుకుమార్ ఏకంగా 1000 మంది డాన్సర్లను రంగంలోకి దించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now