Pushpa Movie : పుష్ప క్రేజ్ ఇంకా తగ్గలేదుగా.. శ్రీవల్లి పాటకు ముంబై పోలీసులు ఫిదా.. వీడియో వైరల్ !

March 16, 2022 10:25 PM

Pushpa Movie : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని డైలాగులు, పాటలను ఎంతోమంది రీల్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా పుష్ప సినిమాకి సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Pushpa Movie Srivalli song mesmerized Mumbai police
Pushpa Movie

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు ముంబై పోలీసులు ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకి బ్యాండ్ క్రియేట్ చేసి ఈ వీడియోని అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో పోలీస్ అధికారులు వివిధ రకాల సంగీత వాయిద్య పరికరాలను ఉపయోగించడం మనం చూడవచ్చు.

ఇక ఈ వీడియోని ముంబై పోలీసులు షేర్ చేస్తూ.. ఖాకీ స్టూడియో రుఖేగా నహీ! ‘శ్రీవల్లి’ పాటకు ముంబై వాసులు అంతా ఊగిపోవడం గమనించాం.. అందులో మేమూ చేరాలని నిర్ణయించుకున్నాం! ” అని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమా విడుదలై మూడు నెలలు అయినా పుష్ప క్రేజ్ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. ఇక ఇది ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now