Pushpa Movie : బ‌న్నీ సినిమాని ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న పుష్ప టీం..!

October 16, 2021 6:46 PM

Pushpa Movie : అల వైకుంఠ‌పుర‌ములో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. రెండు భాగాలుగా చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Pushpa Movie releasing in grand way

పుష్ప మొదటి భాగం పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ లెవల్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అలాగే క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

పుష్ప రిలీజ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్ గా ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ రచ్చ స్టార్ట్ చేయనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now