Pushpa : ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతుండగా, తొలి పార్ట్‌ని డిసెంబర్ 17న విడుదల చేస్తారని గతంలో అనౌన్స్ చేశారు. ఇక ఇటీవల డిసెంబర్ 27న విడుదల కానుందని ప్రచారం జరిగింది. అలాగే మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌పై కూడా అభిమానులలో పలు అనుమానాలు నెలకొని ఉండగా, తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న విడుదల చేయనుండగా, డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఇప్పటివరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.
సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…