Vijay Devarakonda : టాలీవుడ్ యువ హీరోలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఇప్పుడు హీరోగానే కాదు నిర్మాతగాను, బిజినెస్‌మెన్ గాను దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ ఇటీవల తన తమ్ముడు హీరోగా పుష్పక విమానం అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తక్కువ సమయంలోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సంచలన విజయాలు అందుకుని మోస్ట్ సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్.
విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా సంచలన కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు ఆయన డిస్ట్రిబ్యూట్ గా చేశారు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మించారు. మంచి అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. నిర్మాతలకు, బయ్యర్లకు కూడా ఈ సినిమా ఎన్నో కోట్ల నష్టం తెచ్చి పెట్టింది.
తాను చేసిన అన్ని సినిమాల్లోనూ అత్యధిక నష్టాలు తీసుకొచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నాడు అభిషేక్. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత విజయ్ దేవరకొండకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడని.. కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు అంటూ సంచలన కామెంట్ చేశాడు. అలాంటి హీరోతో మరోసారి కలిసి పని చేయాలంటే మనసు రాదు అంటున్నాడు అభిషేక్ నామా.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…