Pushpa : ఒక్క పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్, మూవీ రిలీజ్ డేట్‌ల‌పై క్లారిటీ ఇచ్చిన పుష్ప మేక‌ర్స్..!

November 29, 2021 2:33 PM

Pushpa : ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాల త‌ర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతుండ‌గా, తొలి పార్ట్‌ని డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేస్తార‌ని గ‌తంలో అనౌన్స్ చేశారు. ఇక ఇటీవ‌ల డిసెంబ‌ర్ 27న విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అలాగే మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్‌పై కూడా అభిమానుల‌లో ప‌లు అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, తాజాగా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

Pushpa : ఒక్క పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్, మూవీ రిలీజ్ డేట్‌ల‌పై క్లారిటీ ఇచ్చిన పుష్ప మేక‌ర్స్..!

పుష్ప చిత్రాన్ని డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 6న ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌కటించారు. ఈ ట్రైల‌ర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఇప్పటివరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now