Pushpa Movie : పుష్ప మూవీ ఎఫెక్ట్‌.. అల్లు అర్జున్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు..?

November 18, 2021 11:27 PM

Pushpa Movie : డిసెంబ‌ర్ 17వ తేదీన అల్లు అర్జున్ పుష్ప మూవీ మొద‌టి పార్ట్ రిలీజ్ కానున్న విష‌యం విదిత‌మే. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప‌క్కా మాస్ సినిమా కావ‌డంతో ఆ వ‌ర్గం ప్రేక్ష‌కులు ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఏమోగానీ అటు అల్లు అర్జున్‌, ఇటు ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది.

Pushpa Movie effect allu arjun spending sleepless nights

పుష్ప టీమ్ ప్ర‌స్తుతం ఎంతో బిజీగా ప‌నులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుంది కానీ ఇంకా చాలా ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో టీమ్ మొత్తం రోజుకు 20 గంట‌లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్‌, సుకుమార్ అయితే చిత్ర యూనిట్‌తో క‌లిసి షూటింగ్‌లో, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో బిజీగా పాల్గొంటున్నార‌ట‌. దీంతో వారు ఈ మూవీపై తీరిక లేకుండా గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అందువ‌ల్లే వారికి నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది.

చాలా ప‌ని పెండింగ్‌లో ఉంది, మ‌రోవైపు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇంత షార్ట్ గ్యాప్‌లో మ‌రో తేదీకి మూవీ విడుద‌ల‌ను వాయిదా వేయ‌డం క‌రెక్ట్ కాదు. క‌నుక ఎలాగైనా స‌రే అనుకున్న తేదీకి మూవీని విడుద‌ల చేసేలా చిత్ర యూనిట్ తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ద‌ట‌. మ‌రి ఇంత క‌ష్ట ప‌డినా రేపు అనుకున్న అవుట్ పుట్ వ‌స్తుందా.. రాదా.. అన్న వివ‌రాలు తెలియాలంటే.. సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now