Pushpa Movie : ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఓ అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథ నిడివి ఎక్కువగా ఉండటంతో రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కానీ బన్నీ తన అభిమానులను ఓ విషయంలో నిరాశ పరిచినట్లు తెలుస్తోంది. ఇంతకీ అదేంటంటే.. పలు భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమాకు తాను డబ్బింగ్ చెప్పుకోవడానికి అల్లు అర్జున్ ఇష్టపడటం లేదట. తెలుగు తప్ప మిగతా భాషలలో డబ్బింగ్ చెప్పలేనంటూ.. అందుకు అక్కడి భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టులతో డైలాగులు చెప్పించాల్సిందిగా కోరాడట. ఇక అల్లు అర్జున్ కు చెందిన ఈ విషయం తెలుస్తుండడంతో తెలుగు అభిమానులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా నిరాశ చెందినట్లు తెలుస్తోంది.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అన్ని భాషలకు తాను డబ్బింగ్ చెప్పడం కష్టంగా ఉందట. అందుకనే తెలుగు తప్ప మిగిలిన అన్ని భాషలకు.. అక్కడి ఆర్టిస్టులతో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా పుష్ప మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…