Pushpa Movie : మాస్ అవ‌తారంలో ర‌చ్చ చేస్తున్న బ‌న్నీ.. నాలుగో సాంగ్ పూన‌కాలే తెప్పిస్తోంది..!

November 19, 2021 2:04 PM

Pushpa Movie : క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ సుకుమార్.. అల్లు అర్జున్‌ని మాస్ లుక్ లో చూపిస్తూ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్నాడు. సుకుమార్, బ‌న్నీ కాంబినేష‌న్‌లో ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు తెర‌కెక్క‌గా.. ఇవి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు పుష్ప చిత్రం రూపొందుతోంది. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలను వేగ‌వంతం చేశారు. తాజాగా చిత్రం నుండి నాలుగో పాటను విడుద‌ల చేశారు.

Pushpa Movie 4th song Eyy Bidda Idhi Naa Adda lyrical video launched

మాస్ ఫీస్ట్ సాంగ్ “ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా” అంటూ విడుద‌లైన పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు మూడు సింగిల్స్ ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి’ సాంగ్స్‌ విడుదల కాగా, ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి.

ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ఇందులో బ‌న్నీ వేసే స్టెప్స్ కూడా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రికీ బ‌న్నీ లుక్ షాక్‌ క‌లిగిస్తోంది.

పుష్ప చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటి సమంత సైతం ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడి పాడనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now