Pushpa : అంచ‌నాలు పెంచుతున్న పుష్ప మేక‌ర్స్.. ఒక్క సాంగ్‌లో వెయ్యి మంది డ్యాన్స‌ర్లా..!

November 4, 2021 6:10 PM

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఆర్య‌, ఆర్య‌ 2 చిత్రాల త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బ‌న్నీ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం కావ‌డంతో అందరిలోనూ తెలియ‌ని ఓ చిన్న టెన్ష‌న్ కూడా ఉంది.

Pushpa creating hype 1000 dancers in one song

ఇప్పటికే పుష్ప చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘సామి సామి’ అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో 13 మిలియన్ వ్యూస్ ను దాటింది ఈ పాట.

ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలో ఓ సాంగ్ వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో చిత్రీక‌రించ‌బడింద‌ని తెలియ‌జేశారు. వెండితెర‌పై ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచే విధంగా ఉంటుంద‌ని తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now