Pushpa : పుష్ప సినిమా బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది.. రష్మిక ఫస్ట్ లుక్ అదుర్స్..!

September 29, 2021 1:39 PM

Pushpa : సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం పుష్ప. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే ఇందులో రష్మిక ఒక గ్రామీణ యువతి పాత్రలో సందడి చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం వెల్లడించింది.

Pushpa : పుష్ప సినిమా బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది.. రష్మిక ఫస్ట్ లుక్ అదుర్స్..!
Pushpa

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్, ట్రైలర్, టీజర్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు హీరోయిన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే ఇందులో రష్మిక ఎలా ఉండబోతోంది.. అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తాజాగా పుష్ప సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇందులో శ్రీవల్లి అనే గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మిక.. పుష్పరాజ్ మనసును కరిగించింది అని ట్వీట్ చేస్తూ రష్మిక కూర్చుని అందంగా ముస్తాబవుతున్నటువంటి ఫోటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now