Puri : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ తన తరువాత చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేయనున్నారు.
గాడ్ ఫాదర్ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్క్రిప్ట్ లో పూరీ జగన్నాథ్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మలయాళ చిత్రమైన లూసిఫర్ లో మోహన్ లాల్ నటించారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం పూరీకి నచ్చడంతో.. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరు పాత్రకు సంబంధించి.. ఈ సినిమాలో చిరంజీవిని ఎలా చూపిస్తే బాగుంటుందో.. వివరించినట్లు సమాచారం.
చిరంజీవి క్రేజ్ కి తగ్గట్టుగా తెరపై చిరంజీవిని ఎలా చూపించాలో పూరీ వివరించారట. పూరీ చెప్పిన అంశాలు మెగాస్టార్ కి నచ్చడంతో స్క్రిప్టు మొత్తం పూర్తయినప్పటికీ పూరీ చెప్పిన విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో పూరీ జోక్యం చేసుకొని చిరంజీవి పాత్రను మరింత హైలైట్ చేసే విధంగా చెప్పారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…