Puri Jagannadh : ఎట్టకేలకు ఛార్మితో ఉన్న ఎఫైర్ గురించి బయటపెట్టిన పూరీ జగన్నాథ్..! అసలు కారణం అదే..?

August 19, 2022 6:22 PM

Puri Jagannadh : గత కొంత కాలంగా ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూరీ జగన్నాథ్, చార్మి రిలేషన్ లో ఉన్నారంటూ, పూరీ జగన్నాథ్ త్వరలోనే ఆయన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఛార్మి కారణంగా కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కొడుకు ఆకాష్ నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకకు కూడా పూరీ జగన్నాథ్ హాజరు కాలేదు. నిర్మాత బండ్ల గణేష్ కూడా పూరీ, ఛార్మిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవత లాంటి భార్యను ఎలా వదులుకోవాలి అనిపిస్తోంది పూరీ అంటూ పూరీ జగన్నాథ్ భార్య లావణ్యని ఎంతగానో పొగిడారు.

ఎట్టకేలకు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మికి తనకి మధ్య ఉన్న బంధం ఏంటో తెలియజేశారు. చాలా కాలంగా అందరి మదిలోనూ మెదులుతున్న అనుమానాలకు, సందేహాలకు ఒక్క సమాధానంతో చెక్ పెట్టేశారు. చాలా కాలంగా పూరీ, ఛార్మి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన మొదటి నుంచి ఛార్మి ఈ బ్యానర్ పై నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతోంది. కనెక్ట్స్ బ్యానర్ పై మొదటిగా తెరకెక్కిన చిత్రం జ్యోతిలక్ష్మి. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఒక ఇస్మార్ట్ శంకర్ తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో పూరీ జగన్నాథ్ ఆస్తులను మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇస్మార్ట్‌ శంకర్ విజయంతో వారు కోల్పోయిన ఆస్తులను తిరిగి పొందారు.

Puri Jagannadh finally told about his relation with Charmy Kaur
Puri Jagannadh

పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ పై జనగణమన, లైగర్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాలకు కూడా ఛార్మి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తోంది. ఈ ఆగస్టు 25న లైగర్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్ భాగంలో పూరీ జగన్నాథ్ అనేక ఇంటర్వ్యూల‌లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్.. చార్మి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆమెతో నేను ఎంతో కాలంగా పని చేశాను. ఛార్మి మంచి వయసులో ఉంది కాబట్టి మీ అందరికీ మా బంధం మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఆమెకు పెళ్లి అయి ఉన్నా, అదే ఆమెకు 50 ఏళ్ల వయసు ఉంటే ఇలాంటి పుకార్లు వచ్చేవి కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహ బంధమే. ఒకవేళ మాది రిలేషన్ అయితే అది ఎట్రాక్షన్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఎంతో కాలం కొనసాగదు. కేవలం మేము మంచి స్నేహితులం మాత్రమే. మా మధ్య ఎలాంటి రాంగ్ రిలేషన్ లేదు అంటూ అందరూ నోళ్ళు మూయించే విధంగా సమాధానమిచ్చారు పూరీ జగన్నాథ్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment