Puneeth Rajkumar : కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణంతో కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగానే కాదు మంచి మానవతావాదిగా ఎందరో మనసులు గెలుచుకున్నాడు పునీత్. ఆయనపై అభిమానులకు ఎనలేని ప్రేమ ఉంది, ఈ క్రమంలో పునీత్ మరణించిన విషయం తెలుసుకుని అభిమానులు మృత్యువాత పడుతున్నారు.
పునీత్ మరణం తర్వాత కొందరు గుండెపోటుతో మరణించగా, మరి కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కర్ణాటకలో నలుగురు అభిమానులు ఇలా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విన్న వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే రాయచూరు జిల్లాలో ఇద్దరు అభిమానులు బసవ గౌడ్, మహమ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అందులో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
చామరాజనగర్ జిల్లాలో మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూనే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఉడిపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన హీరో పునీత్ చిత్రపటానికి పూలమాల వేస్తూ అలాగే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. పునీత్ మరణ వార్త తర్వాత కర్ణాటక ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. థియేటర్స్‌ను మూసి వేసింది. మద్యం విక్రయాలపై ఆదివారం వరకు ప్రభుత్వం నిషేధం విధించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…