Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు, దివంగత పునీత్ కుమార్ మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన హఠాత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడి మరణవార్త విన్న ఎందరో అభిమానుల గుండెలు కూడా ఆగిపోయాయి. పునీత్ మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రపంచం ఆయనకు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించింది.
ఇక పునీత్ కి తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలతో ఎంతో మంచి సంబంధం ఉంది. తెలుగు, తమిళ హీరోలు నటించిన సినిమాలు కన్నడంలో విడుదలయ్యి మంచి వసూళ్లను రాబడుతాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పునీత్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అనుబంధంతోనే తెలుగు హీరోలు పునీత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తమ మిత్రుడి ఆఖరి చూపు కోసం చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి ప్రముఖులు బెంగళూరుకు చేరుకొని తమ మిత్రుడిని కడసారి చూసుకుని వీడ్కోలు పలికారు.
అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎంతో మంది హీరోలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నటుడి పట్ల తెలుగు హీరోలు చూపిస్తున్న ప్రేమను చూసి కన్నడ అభిమానులు ఎంతో ముచ్చట పడ్డారు.
ఈ క్రమంలోనే పునీత్ అభిమానులు తమిళ హీరోల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు పునీత్ కి తమిళంలో కూడా ఎంతో మంచి మిత్రులు ఉన్నారు. వారి సినిమాలు కూడా ఇక్కడ విడుదలవుతుంటాయి. అలాంటిది ఒక స్టార్ హీరో మృతి చెందితే ఏ ఒక్క తమిళ హీరో కూడా ఆయన కడచూపు కోసం బెంగుళూరుకు రాలేదంటూ తమిళ హీరోలు అందరూ ఎక్కడ..? అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కన్నడలో తమిళ హీరోల సినిమాలను బాయ్‌కాట్ చేస్తామంటూ పునీత్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…