Tollywood : టాలీవుడ్ నిర్మాత‌ల సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్‌..!

Tollywood : గ‌త కొంత కాలంగా టాలీవుడ్ ప‌రిశ్రమ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న విష‌యం విదిత‌మే. ఓటీటీల ప్ర‌భావం వ‌ల్ల.. సినిమాలు బాగున్న‌ప్ప‌టికీ థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం లేదు. కొన్ని రోజులు పోతే ఓటీటీల్లోనే చూడ‌వ‌చ్చు క‌దా.. అని భావిస్తున్నారు. దీంతో సినిమాలకు క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోయాయి. మంచి సినిమా అని ముద్ర వేసుకున్నా క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌డం లేదు. దీంతో నిర్మాత‌లు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. వారు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సినిమాల‌కు భారీగా న‌ష్టాలు వ‌స్తున్నాయి.

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తార‌ని భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. మొద‌టికే మోసం వ‌చ్చింది. అంత‌కు ముందు క‌న్నా ఇప్పుడే థియేట‌ర్ల‌కు వెళ్లే ప్రేక్ష‌కుల సంఖ్య బాగా త‌గ్గింది. దీంతో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 1 నుంచి సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని ప్ర‌ముఖ నిర్మాత‌లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సెన్సేష‌న్‌ను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే పలువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు ఇదే విష‌యంపై గ‌త కొద్ది రోజులుగా స‌మాశాలు నిర్వ‌హిస్తూ.. చ‌ర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని నిర్ణయానికి వచ్చారు.

Tollywood

అయితే ఎప్ప‌టి వ‌ర‌కు షూటింగ్‌ల‌ను నిలిపివేస్తారు.. అన్న విష‌యంపై మాత్రం వారు స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌లేదు. కానీ ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ చ‌ర్చించి ప‌రిష్క‌రించాకే షూటింగ్‌ల‌ను ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఇందుకు ఎన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుందో ఇప్పుడే చెప్పలేమ‌ని అంటున్నారు. ఏది ఏమైనా క‌రోనా అనంత‌రం సినిమా రంగ ప‌రిస్థితులు దారుణంగా మారాయి. క‌లెక్ష‌న్లు లేక థియేట‌ర్లు, నిర్మాత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దీనికి ప‌రిష్కారం క‌నుగొంటారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM