Pawan Kalyan : ప‌వ‌న్‌తో సినిమా.. భ‌య‌ప‌డుతున్న నిర్మాత‌లు..?

July 14, 2022 10:20 AM

Pawan Kalyan : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళ చిత్రం వినోద‌య సీత‌మ్‌ను రీమేక్ చేయ‌నున్న విష‌యం విదిత‌మే. దీనికి న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ మూవీ ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ ప‌వ‌న్ పొలిటిక‌ల్ టూర్ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ లాంచింగ్‌ను ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాతల్లో ఆందోళ‌న నెల‌కొంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడాక మళ్లీ సినిమాల్లోకి వ‌చ్చారు. అలా వ‌చ్చాక తీసిందే భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ షూటింగ్ కూడా అనేక సార్లు వాయిదా ప‌డింది. క‌రోనా వ‌ల్ల మ‌రింత ఆల‌స్యం అయింది. అలాగే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని 2 ఏళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు. ఈ మూవీ ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక తాజాగా వినోద‌య సీత‌మ్ రీమేక్ కూడా మొద‌టి రోజే వాయిదా ప‌డింది. ఇలా వాయిదా ప‌డుతుండడం వ‌ల్ల నిర్మాత‌ల‌కు తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతోంది. దీని వ‌ల్ల ప‌వ‌న్‌తో సినిమా తీద్దామంటేనే నిర్మాత‌లు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

producers are worrying about Pawan Kalyan films
Pawan Kalyan

అయితే ఇందులో ప‌వ‌న్ త‌ప్పేమీ లేదు. ఎందుకంటే ఆయ‌న సినిమాల‌తోపాటు రాజ‌కీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే త‌న‌కు వేరే ఆర్థిక వ‌న‌రులు ఏవీ లేవ‌ని.. సినిమాల‌తో వ‌చ్చే ఆదాయంతోనే రాజ‌కీయాల్లో ప‌నులు చేస్తున్నాన‌ని.. క‌నుక త‌న సినిమాల‌ను చూడాల‌ని ఆయ‌న గ‌తంలోనే కోరారు. ఇక ప్ర‌స్తుతం ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావిడి న‌డుస్తుండ‌డంతో ఆయ‌న ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. అందువ‌ల్లే సినిమాల షూటింగ్‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఏది ఏమైనా.. ప‌వ‌న్ తో సినిమాలు చేద్దామ‌ని అనుకునే నిర్మాత‌లు ఆయ‌న పొలిటిక‌ల్ షెడ్యూల్‌ను కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే న‌ష్టాల‌ను భ‌రించ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now