Priyanka Chopra : బాబోయ్.. ప్రియాంక ఎంగేజ్‌మెంట్ రింగ్ ఖ‌రీదు అన్ని కోట్లా..!

November 13, 2021 10:15 AM

Priyanka Chopra : గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంక చోప్రా ఇప్పుడు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్ష‌న్‌గా మారంది. ఆమె చేసే ప్ర‌తి పని నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రియాంక చోప్రా జోనాస్ తన ఎంగేజ్‌మెంట్ రింగ్ సెంటిమెంట్‌ గురించి చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనికి గురించి చెప్పకపోతే నిక్‌ చంపేస్తాడు.. అంటూ చమత్కరించింది.

Priyanka Chopra engagement ring cost will surprise you

తన నిశ్చితార్థపు ఉంగరం మరింత ప్రతిష్టాత్మకమైందని, దీనికి తనకు చాలా సెంటిమెంట్‌ ఉందని వెల్లడించింది. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు అందులో ఇమిడి ఉన్నాయని, అందుకే అంత ప్రత్యేకమని చెప్పింది. పాపులర్‌ టిఫనీస్‌కు చెందిన రూ. 2 కోట్ల ఈ డైమండ్‌ రింగ్‌కు దివంగత తండ్రితో బలమైన సెంటిమెంట్ కనెక్షన్‌ ఉందంటూ బ్యాక్‌ స్టోరీని వివరించింది.

పాప్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం ఆమెరికాలోనే స్థిరపడిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నుంచే హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటోంది. యూఎస్‌లో ఇటీవ‌ల ఓ హోట‌ల్ ను కూడా ఈ అమ్మ‌డు ప్రారంభించింది. అక్క‌డ ప్రియాంక కొన్ని ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి వైర‌ల్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now