Priyamani : ప్రియ‌మ‌ణి కొత్త ఫొటోలు.. బ్లాక్ అండ్ వైట్‌తో అద‌ర‌గొట్టింది..!

September 30, 2021 10:36 AM

Priyamani : సినిమా ఇండస్ట్రీలో త‌క్కువ సినిమాలు మాత్ర‌మే చేసినా ప్రియ‌మ‌ణి త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. పెళ్ల‌య్యాక సినిమాల్లో న‌టించ‌క‌పోయినా బుల్లి తెర‌పై మాత్రం అనేక షోల‌లో క‌నిపిస్తూ ప్రియ‌మ‌ణి సంద‌డి చేస్తోంది. ఇక తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

Priyamani : ప్రియ‌మ‌ణి కొత్త ఫొటోలు.. బ్లాక్ అండ్ వైట్‌తో అద‌ర‌గొట్టింది..!
Priyamani

ఎవ‌రే అత‌గాడు సినిమాతో ప్రియ‌మ‌ణి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. త‌క్కువ స‌మ‌యంలోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని హిట్ చిత్రాల్లోనూ ఆమె న‌టించింది. అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించే చాన్స్‌ల‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ప్రియ‌మ‌ణి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రియ‌మ‌ణి కేవ‌లం తెలుగు సినిమాల్లోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌కు చెందిన సినిమాల్లోనూ న‌టించి మెప్పించింది. పెళ్లి అనంత‌రం ఆమె చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంది. అయితే ఈసారి మాత్రం ఆమె ప‌లు టీవీ షోల‌లో క‌నిపిస్తూ అల‌రిస్తోంది. ఇక కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లోనూ ఈమె న‌టిస్తోంది.

బుల్లి తెర‌పై ప్రియ‌మ‌ణికి చాలా మంది ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఈమె చేసే షోల‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌తో ఈమెకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now