Priya Prakash Varrier : ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కు హోట‌ల్‌లో చేదు అనుభ‌వం.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

January 26, 2022 11:39 AM

Priya Prakash Varrier : సినీ న‌టులు అయిన‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో వారికి కూడా చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతుంటాయి. అంద‌రి ముందు అవ‌మానం చెందాల్సి వ‌స్తుంటుంది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కు కూడా పెద్ద అవ‌మాన‌మే జ‌రిగింది. ఆమెకు ఓ హోట‌ల్‌లో చేదు అనుభ‌వం ఎదురైంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యానికి వ‌స్తే..

Priya Prakash Varrier insulted by hotel staff what happened

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అక్క‌డ ఆమెకు ఫెర్న్ గోరెగావ్ హోట‌ల్‌లో రూమ్స్ బుక్ చేశారు. అయితే ఆ హోట‌ల్‌లోకి బ‌య‌టి ఫుడ్‌ను అనుమ‌తించ‌రు. అక్క‌డే ఏదైనా కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది.

ఈ విష‌యం తెలియ‌ని ప్రియా.. తాను షూటింగ్ నుంచి హోట‌ల్ రూమ్‌కు వ‌స్తూ.. మ‌ధ్య‌లో ఫుడ్ కొనుగోలు చేసింది. దాన్ని హోట‌ల్ రూమ్‌లో తినొచ్చ‌ని ఆమె భావించింది. కానీ హోట‌ల్ పాల‌సీ ప్ర‌కారం బ‌య‌టి ఫుడ్‌ను అనుమ‌తించ‌రు క‌నుక‌.. వారు ఆమెను ఆ ఫుడ్‌ను తీసుకెళ్ల‌నివ్వ‌లేదు. ఫుడ్ ప‌డేస్తే బ‌య‌ట ప‌డేయండి.. లేదంటే బ‌య‌టే ఉండి తినండి.. కానీ లోప‌లికి మాత్రం ఫుడ్‌ను అనుమ‌తించ‌బోము.. అంటూ ఆ హోట‌ల్ వారు ఆమెకు ఖ‌రాఖండిగా చెప్పేశారు. దీంతో ప్రియా చేసేది లేక బ‌య‌ట చ‌లిలోనే నిల‌బ‌డి ఫుడ్‌ను తిన్నది.

ఇక ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. తాను ఫుడ్‌ను ముందుగానే ఆర్డ‌ర్ చేసుకున్నాన‌ని, ఆ హోట‌ల్‌లోకి బ‌య‌టి ఫుడ్ అనుమ‌తి లేద‌నే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, అయితే కొన్న ఫుడ్ ను వృథాగా ప‌డేయ‌డం ఇష్టం లేకే హోట‌ల్ బ‌య‌ట చ‌లిలో అలాగే నిల‌బ‌డి ఫుడ్ తిన్నాన‌ని చెప్పుకొచ్చింది. ఈ ఒక్క‌సారికి వ‌దిలేయ‌మ‌ని తాను రిక్వెస్ట్ చేసినా ఆ హోట‌ల్ వారు ప‌ట్టించుకోలేద‌ని, పెద్ద సీన్ క్రియేట్ చేశార‌ని.. ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇలా ఆమె తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాన్ని, అవ‌మానాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

కాగా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఇటీవ‌లే నితిన్‌తో క‌లిసి చెక్ అనే సినిమాలో న‌టించింది. కానీ ఈ మూవీ ఈమెకు పెద్ద‌గా పేరు తెచ్చి పెట్ట‌లేదు. దీంతో ఇప్ప‌టికీ ఈమె మంచి హిట్ కోసం వేచి చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now