Ram Charan Tej : కొన్ని ఫొటోలు చూడగానే ఇట్టే ఆకర్షిస్తుంటాయి. అవి సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా రామ్ చరణ్, చిరంజీవి, ప్రశాంత్ నీల్ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేములో కనిపించే సరికి అందరి మదిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్‌నీల్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈయన కోసం బాలీవుడ్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. అప్పట్లో రెండో సినిమా సింహాద్రి సినిమాతో రాజమౌళి ఎలాంటి సంచలనం రేపాడో.. ఇప్పుడు రెండో సినిమా కేజీఎఫ్ సినిమాతో అలాంటి ప్రకంపనలే సృష్టించాడు ప్రశాంత్ నీల్.
ప్రశాంత్ నీల్ రానున్న రోజులలో తెలుగు హీరోలతో వరుస సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్న ఈ దర్శకుడు తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్‌తో సినిమాలు చేయనున్నట్టు ప్రచారం నడుస్తోంది. ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుండగా, దీనికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ ను అనుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
రీసెంట్‌గా రామ్ చరణ్.. ప్రశాంత్ నీల్‌ని తన ఇంటికి ఆహ్వానించగా, ఆ సమయంలో చిరంజీవితో కలిసి ఈ ఇద్దరు ఫొటో దిగారు. ఆ ఫొటోని ప్రశాంత్‌నీల్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ లెజెండ్‌ని కలిసినందుకు సంతోషంగా ఉంది. చిరంజీవిని కలిసినందుకు చిన్నప్పటి కల నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…