Praneetha : టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత కెరీర్‌లో అంతగా సక్సెస్ కాలేదు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియర్ ఎన్టీఆర్ తో రభస, మంచు విష్ణుతో పాండవులు పాండవులు తుమ్మెద, రామ్‌తో హలో గురు ప్రేమకోసమే చిత్రాలతో అలరించింది.
గతేడాది హంగామా 2, భూజ్ సినిమాలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సమయంలో ఫాన్స్ కి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత. దీంతో వీరిది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
అంతేకాదు ప్రణీత భర్త ఏం చేస్తాడు, అతనికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అంటూ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఆమె భర్త ఏమాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. అయితే అతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయట. స్కూల్ డీ హాస్పిటాలిటీ కాలేజీలో చదువుకున్న అతను హాస్పిటల్ మేనేజ్ మెంట్ లో ఉన్నత చదువు పూర్తి చేశాడు. బ్లూ హారిజన్ పేరిట హోటల్స్ పెట్టి హోటల్ రంగంలో రాణిస్తున్న నితిన్ రాజు లాభాల బాటలో హోటల్స్ రన్ చేస్తున్నాడని, మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడని టాక్. ఈ క్రమంలోనే అతనికి వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…