Prakash Raj : మైండ్ గేమ‌ర్‌గా మారిన ప్రకాష్ రాజ్.. ‘మా’ విడిపోవడానికి అదే కారణమా ?

October 13, 2021 5:12 PM

Prakash Raj : మూవీ ఆర్టిస్టుల కోసం ఓ సంఘాన్ని పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు సినిమా ఆర్టిస్టులంతా కలిసి ఓ అధ్యక్షుడిని ఎంచుకుని సినిమా ఆర్టిస్టుల ఇబ్బందుల్ని, సమస్యల్ని పరిష్కరిస్తూ.. వారి ఆర్థిక సమస్యల్ని తీరుస్తున్నారు. అలాంటి మా అసోసియేషన్ ప్రస్తానంలో నేడు వివాదాలు ఎక్కువై చీలికలు ఏర్పడ్డాయి. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాతోపాటు సినీ ఇండస్ట్రీలోనూ హల్ చల్ అవుతోంది. దీనికి కారణం ఇటీవల జరిగిన ఎన్నికలే అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన మా సభ్యత్వం నుండి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.

Prakash Raj  is mind gamer may be he is the reason maa split

ఆయన ప్యానెల్ లో గెలిచిన 11 మంది సభ్యులు మా అసోసియేషన్ కు రాజీనామా చేశారు. ఆయనకు కొంతమంది సినీ ప్రముఖుల సపోర్ట్ ఉందనే విషయం తెలిసిందే. మంచు విష్ణుకు ఇబ్బంది కలిగించకూడదనే కారణంతోనే ప్రకాష్ రాజ్ మెంబర్స్ రాజీనామా చేశారని తెలిపారు. దీంతో మా అసోసియేషన్ లో ఇంతటి సంచలనాలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. మా సంస్థ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.

అలాంటిది ఇప్పుడు మా సభ్యులు ఏ ఒక్కరూ సరిగ్గా పనిచేయకపోయినా తాము ప్రశ్నిస్తామని ప్రకాష్ రాజ్ టీమ్ తెలిపింది. ఇప్పటి వరకు మా అసోసియేషన్ అంటే వసుదైక కుటుంబం అంటూ చిరంజీవి గతంలో అన్నారు. అలాంటిది చిరంజీవిపై కామెంట్ చేయడం.. టాలీవుడ్ కింగ్ మోహన్ బాబు అంటూ మరికొంతమంది మద్దతు ఇచ్చారు. అందుకే మంచు కుటుంబానికి సపోర్ట్ అందిస్తూ.. ఎంతోమంది సీనియర్ నటీనటులు ముందుకు వచ్చారనే విషయం తెలుస్తోంది.

ప్రకాష్ కు సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ ఉన్నా కూడా నాగబాబు తప్ప మరెవరు బయటకు రాకపోవడం గమనార్హం. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచారనే విషయం తెలిశాక నాగబాబు మా సభ్యత్వం నుండి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటుగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వేరుగా మూవీ అసోసియేషన్ పెడతారనే వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా విడిగా పెట్టడానికి కారణం మెగా సపోర్ట్ తోనే ప్రకాష్ రాజ్ మరో నూతన అసోసియేషన్ పెడతారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now