Prakash Raj : మరో షాక్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. రాజీనామాకు కారణం ఏంటో త్వరలోనే తెలియజేస్తా..!

October 12, 2021 1:37 PM

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు ప్యానెల్ సభ్యులు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటూ.. సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

Prakash Raj told that he will tell real reason why he resigned to maa membership

ఈ క్రమంలోనే మా ఎన్నికలలో భాగంగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికలు కేవలం ప్రాంతీయత ఆధారంగా జరిగాయని. తెలుగువాళ్లు అధ్యక్ష పీఠాన్ని తెలుగు బిడ్డ అధిరోహించాలని కోరుకున్నారని.. అదే విధంగా మంచు విష్ణును గెలిపించారని తెలియజేశారు.

ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను మా సభ్యత్వానికి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తొందరలోనే తెలియజేస్తానని.. తన రాజీనామా వెనుక ఒక లోతైన కారణం ఉందంటూ.. త్వరలోనే వాటన్నింటినీ క్లుప్తంగా వివరిస్తానని పేర్కొంటూ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment