Pragathi : సీనియర్ నటి ప్రగతి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే ఆమె తన బర్త్ డే వేడుకలను జరుపుకోగా.. అందులో ఆమె గ్లామరస్ డ్రెస్‌తో కనువిందు చేసింది. దీంతో ఈ వయస్సులో మీకు బర్త్ డేలు అవసరమా.. ఇలాంటి దుస్తులు ఎందుకు ధరించాలి.. బర్త్ డేలు ఎందుకు చేసుకోవాలి.. అంటూ చాలా మంది ఆమెను విమర్శించారు. అయితే ఆ విమర్శలను మాత్రం ఈమె ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. ఇక ఈమె పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో ఎఫ్3 మూవీలో ఈ మధ్యే నటించగా.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అందులో భాగంగానే ఆమె సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది.
తాను చాలా సినిమాల్లో అనేక పాత్రల్లో నటించానని.. అయితే ఎఫ్3 మూవీలో నటించిన పాత్ర తనకు ఎంతో తృప్తినిచ్చిందని.. మళ్లీ అలాంటి క్యారెక్టర్ లభిస్తుందో లేదోనని తెలియజేసింది. ఎఫ్3 మూవీలో తాను భిన్నమైన పాత్రలో నటించానని.. తనకు చాన్స్ ఇచ్చినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక ప్రగతి సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులో ఆమె అనేక పోస్టులను పెడుతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ప్రగతి చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందులో ఆమె పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. దీంతో అవి వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె తాను జిమ్‌లో చేసే వర్కవుట్లకు చెందిన వీడియోలను కూడా పెడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా అలాంటిదే మరో వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె జిమ్‌లో తెగ కష్టపడుతుండడాన్ని చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…