Prabhas : ఆయ‌న సినిమాలే కాదు.. వేరే హీరోల సినిమాలనూ 20 సార్లు వీక్షించిన ప్ర‌భాస్..!

October 24, 2021 3:42 PM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఆయ‌న రేంజ్ పూర్తిగా మారింది. త్వ‌ర‌లో రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు ప్ర‌భాస్. ప్రభాస్ 42వ పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఒక సరికొత్త టీజర్ విడుదల చేస్తుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి టీజర్ అయితే అభిమానులకు బాగా నచ్చింది.

Prabhas watched their movies 20 times

ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ త్వ‌ర‌లో ప్రాజెక్ట్ కె అనే చిత్రంతోపాటు స్పిరిట్ అనే చిత్రాలు చేయనున్నాడు. ఈ సినిమాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. అయితే ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి అనేక ఆసక్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా ఫేవరెట్ మూవీస్ ఉండ‌గా, వాటిని ఏకంగా 20 సార్లు చూశాడట ప్రభాస్.

ప్రభాస్ ఫేవరెట్ హీరో రాబర్ట్ డే నీరో కాగా, ఈయన హాలీవుడ్ హీరో. ఆయ‌న సినిమాలు బాగా చూస్తాడు. ఇక ఇండియా లో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతాడు ప్ర‌భాస్. అందులో భాగంగానే ఆయన నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ అనే సినిమాలను దాదాపుగా 20 సార్లు వీక్షించాడట. ఈ విష‌యం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్ర‌భాస్ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రభాస్‌ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment