Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు. ఆయన చేసే సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలపై ప్రతి ఒక్కరికీ అమితమైన ఆసక్తి నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 41 సంవత్సరాలు కాగా ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎవరికీ తెలియడం లేదు. సల్మాన్ ఖాన్ మాదిరిగా బ్యాచిలర్‌గానే ఉండిపోతాడా..? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తన బిడ్డకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ప్రభాస్ పెళ్లి కోసం మేం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ అన్నాడు. ప్రభాస్ తనను ప్రేమగా కన్నమ్మ అని పిలుస్తాడని, పెదనాన్న కృష్ణంరాజును పెద్ద బాజీ అని పిలుస్తాడని ఫోన్లలో సైతం తమ పేర్లను అదే విధంగా సేవ్ చేసుకున్నాడని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ప్రుస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే మొదటి నుంచి ‘సలార్’ మూవీకి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. రీసెంట్‌గా యాక్షన్ వీడియో ఒకటి విడుదల కాగా, ఇది చూసి ఫ్యాన్స్ మైమరచిపోయారు. ఇక ఆదిపురుష్ షూటింగ్ దాదాపుగా పూర్తైందని, త్వరలోనే స్పిరిట్ కూడా మొదలు పెడతారని.. అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…