Prabhas : కృష్ణంరాజు పేరును ప్రభాస్‌ తన ఫోన్‌లో ఏమని సేవ్‌ చేశాడో తెలుసా ?

October 20, 2021 2:48 PM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు. ఆయ‌న చేసే సినిమాల‌తోపాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై ప్ర‌తి ఒక్క‌రికీ అమిత‌మైన ఆస‌క్తి నెల‌కొని ఉంది. దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్ర‌భాస్ వ‌య‌స్సు ప్ర‌స్తుతం 41 సంవత్సరాలు కాగా ఆయ‌న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. స‌ల్మాన్ ఖాన్ మాదిరిగా బ్యాచిల‌ర్‌గానే ఉండిపోతాడా..? అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Prabhas saved krishnam raju name is his phone with this name

తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి త‌న బిడ్డ‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. ప్ర‌భాస్ పెళ్లి కోసం మేం అంద‌రం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌ని తెలిపారు. ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్త‌య్యాక పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భాస్ అన్నాడు. ప్రభాస్ తనను ప్రేమగా కన్నమ్మ అని పిలుస్తాడని, పెదనాన్న కృష్ణంరాజును పెద్ద బాజీ అని పిలుస్తాడని ఫోన్లలో సైతం తమ పేర్లను అదే విధంగా సేవ్ చేసుకున్నాడని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.

ప్రభాస్‌ ప్రుస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్‌ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే మొదటి నుంచి ‘సలార్‌’ మూవీకి లీక్‌ల బెడద తప్పడం లేదు. ఈ మూవీ సెట్స్‌లోని ప్రభాస్‌ ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. రీసెంట్‌గా యాక్ష‌న్ వీడియో ఒక‌టి విడుద‌ల కాగా, ఇది చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోయారు. ఇక ఆదిపురుష్ షూటింగ్ దాదాపుగా పూర్తైందని, త్వ‌ర‌లోనే స్పిరిట్ కూడా మొద‌లు పెడ‌తారని.. అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment