Prabhas : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. రోజుకు కొన్ని లక్షల వీడియో రీల్స్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఇలాంటి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ రీల్స్ అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి తెలియదట. పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన సినిమా రాధేశ్యామ్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్ దగ్గరికి యాంకర్ వెళ్లి సార్ మీతో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయాలని ఉందని అడిగిందట. దాంతో ప్రభాస్ అదేంటి.. అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టడంతో వెంటనే అలర్ట్ అయిన పీఆర్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే ఏంటో వివరించారు. ఇలా రీల్స్ అంటే ఏంటో తెలుసుకున్న ప్రభాస్.. అయ్య బాబోయ్.. అవా.. నావల్ల కాదు.. అంటూ మెల్లిగా జారుకున్నాడు.
ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్‌కి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే తెలియక పోవడం ఏంటి ? అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడం విశేషం. మరి ఆయన ఇలా సమాధానం చెప్పడంతో.. కావాలనే అలా చెప్పారా ? లేదా నిజంగానే ఆయనకు రీల్స్ అంటే ఏంటో తెలియదా ? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…