Prabhas : ప్రభాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ అంటే తెలియదట..!

March 9, 2022 11:35 AM

Prabhas : ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. రోజుకు కొన్ని లక్షల వీడియో రీల్స్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఇలాంటి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ రీల్స్ అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ కి తెలియదట. పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన సినిమా రాధేశ్యామ్‌ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

Prabhas said he does not know about Instagram reels
Prabhas

ఈ విధంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాస్‌ దగ్గరికి యాంకర్ వెళ్లి సార్ మీతో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయాలని ఉందని అడిగిందట. దాంతో ప్రభాస్‌ అదేంటి.. అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టడంతో వెంటనే అలర్ట్ అయిన పీఆర్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే ఏంటో వివరించారు. ఇలా రీల్స్ అంటే ఏంటో తెలుసుకున్న ప్రభాస్‌.. అయ్య బాబోయ్.. అవా.. నావల్ల కాదు.. అంటూ మెల్లిగా జారుకున్నాడు.

ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్‌కి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ అంటే తెలియక పోవడం ఏంటి ? అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడం విశేషం. మరి ఆయన ఇలా సమాధానం చెప్పడంతో.. కావాలనే అలా చెప్పారా ? లేదా నిజంగానే ఆయనకు రీల్స్ అంటే ఏంటో తెలియదా ? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now