Radhe Shyam Movie Review : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె న‌టించిన.. రాధే శ్యామ్ మూవీ రివ్యూ..!

March 11, 2022 8:39 AM

Radhe Shyam Movie Review : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..!

Prabhas Pooja Hegde Radhe Shyam Movie Review
Radhe Shyam Movie Review

క‌థ‌..

విక్ర‌మాదిత్య (ప్రభాస్‌) అత్యంత ప్ర‌ఖ్యాతిగాంచిన హ‌స్త సాముద్రిక నిపుణుడు. జ్యోతిష్యం చెబుతాడు. అత‌ను చెప్పిన‌వి చెప్పిన‌ట్లు జ‌రుగుతూ ఉంటాయి. ఒక రైలు ప్ర‌మాదానికి గుర‌వుతుంద‌ని ముందే ఊహించి చెబుతాడు. ఒక ధ‌నికుడికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని చెబుతాడు. అవ‌న్నీ అలాగే జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలోనే అత‌ను ఒక సంద‌ర్భంలో ప్రేర‌ణ (పూజా హెగ్డె)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయి ? హ‌స్త సాముద్రిక నిపుణుడిగా పేరుగాంచిన విక్ర‌మాదిత్య‌కు వారి జీవితాల‌కు చెందిన నిజాలు ముందే తెలిశాయా ? ఆ త‌రువాత అత‌ను ఏం చేశాడు ? చివ‌ర‌కు క‌థ సుఖాంతం అయ్యిందా ? అన్న విష‌యాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

సినిమాలో న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే అంద‌రూ బాగానే నటించారు. ముఖ్యంగా ప్ర‌భాస్‌, పూజా హెగ్డెల మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అలాగే సినిమాలోని లొకేష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. చాలా రోజుల త‌రువాత ప్ర‌భాస్ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించాడు. థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ అనే కొత్త క‌థాంశంతో చేసిన ప్ర‌యోగం ఆక‌ట్టుకుంటుంది. ప్రేమ‌లో సైన్స్‌, జ్యోతిష్యాన్ని క‌లిపారు. దీంతో ఆ ప్రేమికులు భ‌విష్య‌త్తులో ఎదుర్కొన‌బోయే సంఘ‌ట‌న‌లు ముందే తెలుస్తాయి. త‌రువాత వారు ఏం చేస్తారు ? అన్న అంశాల‌ను బాగానే చూపించారు. అయితే సినిమా స్లోగా సాగుతుంది. కొన్ని చోట్ల సీన్లు ప‌ర‌మ బోర్‌, చెత్త‌గా అనిపిస్తాయి. అవి త‌ప్పితే ఓవ‌రాల్‌గా ఇది ఫీల్ గుడ్ మూవీ అని చెప్ప‌వ‌చ్చు. ఫ్యామిలీతో క‌లిసి ఒక‌సారి చూడ‌వ‌చ్చు. కొత్త‌ద‌నం కోరుకునే వారికి న‌చ్చుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now