Prabhas : దర్శకుడు మారుతికి గోల్డెన్ చాన్స్ లభించిందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకంగా ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేశాడని అంటున్నారు. పక్కా కమర్షియల్ చేస్తున్న మారుతి తరువాత తన సినిమాను ప్రభాస్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మారుతికి ప్రభాస్ ఒక్క చాన్స్ ఇచ్చారట. దీంతో ప్రభాస్‌కు మారుతి కథ వినిపించగానే.. అందుకు ప్రభాస్ అంగీకరించారట. ఈ క్రమంలోనే ఆ మూవీ కామెడీ, యాక్షన్, డ్రామా జోనర్‌లలో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు చేయలేదని అంటున్నారు. అందువల్ల కచ్చితంగా సినిమా హిట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కాగా ఈ సినిమాకు ప్రభాస్ ఒప్పుకున్నారని.. మరో రెండు మూడు రోజుల్లో అగ్రిమెంట్ కూడా అవుతుందని తెలుస్తోంది. వెంకటేష్ నటించిన బాబు బంగారం సినిమా తరువాత అంతటి పెద్ద స్టార్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించనున్నారు. అయితే ప్రభాస్‌తో చేసే సినిమా హిట్ గనక అయితే మారుతి అగ్ర దర్శకుల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీనికి ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణ బాధ్యతలు వహిస్తారని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…