Prabhas Anushka : ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారా..?

September 16, 2022 12:28 PM

Prabhas Anushka : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ లో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అని అడగగానే వెంటనే గుర్తుకు వచ్చేది.. ప్రభాస్ మరియు అనుష్క. బాహుబలి చిత్రం సమయంలో ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గత కొంత కాలంగా వీళ్ళిద్దరి పెళ్లి విషయంపై ఎలాంటి వార్తలు కూడా ప్రసారం కావడం లేదు.  తాజాగా అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

నాలుగు పదుల వయస్సు దాటినా వీరు పెళ్లి విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రభాస్ మరియు అనుష్కల పెళ్లి గోల మళ్ళీ మొదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణం తర్వాత మళ్లీ  ఇద్దరు పెళ్లి పెట్టలేకపోతున్నారు అంటూ అనుష్క, ప్రభాస్ పై  సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు హాస్పిటల్ లో ఉన్న  సమయంలో అనుష్క ఆయన్ని పరామర్శించింది. ఆ సమయంలో అనుష్క మీడియా కంటికి చిక్కింది. వీరిద్దరూ సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతున్నారని, పెళ్లి చేసుకున్న తర్వాత ఉండడానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Prabhas Anushka are going to marry what news say
Prabhas Anushka

వీరి పెళ్లి విషయంపై ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నా అనుష్క, ప్రభాస్ ఇద్దరూ కూడా ఏ విధమైన స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎప్పటి నుంచో ప్రభాస్ కి వివాహం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆయన అకాల మరణంతో ప్రభాస్ పెళ్లి ప్రయత్నాలకు పుల్ స్టాప్ పడింది.  ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్  నీల్  దర్శకత్వంలో సాలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న అనుష్క కూడా నాలుగు పదుల వయస్సు దాటుతున్నా పెళ్లి వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తూ వస్తుంది.  అనుష్కకి ఇప్పటి వరకు పెళ్లి కాకపోవడంతో ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలలో కూడా బిజీగా లేని అనుష్క మరి పెళ్లి  ఎందుకు చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now