Post Office Scheme : మనదేశంలోని పౌరులకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేస్తే కచ్చితమైన లాభాలను పొందడంతోపాటు మన డబ్బుకు రక్షణ కూడా ఉంటుంది. పైగా వడ్డీని కూడా ఎక్కువగానే చెల్లిస్తారు. కనుకనే పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలను ప్రజలకు అందిస్తూ వస్తోంది. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ (రికరింగ్ డిపాజిట్) స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బును పొదుపు చేస్తూ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును లాభంగా పొందవచ్చు.
పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ స్కీమ్ ద్వారా కనీసం 5 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయాలి. ఈ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. నెలకు కనీసం రూ.100 పొదుపు చేయవచ్చు. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు. లిమిట్ లేదు. ముగ్గురు వ్యక్తులు కలసి ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దగ్గర ఉండి ఈ స్కీమ్‌ను ఓపెన్ చేయించవచ్చు.
ఈ స్కీమ్‌లో డబ్బును చిన్నారుల పేరిట పొదుపు చేస్తే వారు పెద్దయ్యే సరికి డబ్బు చేతికొస్తుంది. ఇది వారి పెళ్లికి లేదా ఉన్నత చదువులకు పనికొస్తుంది. ఈ స్కీమ్‌లో కనీసం 5 ఏళ్లపాటు డబ్బును పొదుపు చేయాలి. 3 ఏళ్ల పాటు నిరంతరాయంగా నెల నెలా డబ్బును చెల్లిస్తూ పొదుపు చేస్తే డబ్బును ముందుగానే తీసుకోవచ్చు. కానీ వడ్డీ తక్కువ వస్తుంది.
ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ ద్వారా డబ్బులను పొదుపు చేస్తే ఏప్రిల్ 2020 గణాంకాల ప్రకారం ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద రోజుకు రూ.70 అంటే.. నెలకు రూ.2100 జమ చేస్తే 5 ఏళ్లు ముగిసే సరికి ఖాతాలో రూ.1,26,000 ఉంటాయి. దీనికి రూ.20వేలు వడ్డీ కలిపితే రూ.1,46,000 అవుతాయి. అంటే రూ.1.50 లక్షల మేర వస్తాయన్నమాట.
5 ఏళ్లు ముగిశాక ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు. లేదా మరో 5 ఏళ్లు పథకాన్ని పొడిగించుకోవచ్చు. చిన్న చిన్న మొత్తాలను సురక్షితంగా పొదుపు చేయాలనుకునే వారి కోసం పోస్టాఫీస్ ఆర్‌డీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…