Adivi Sesh Major : కరోనా వైరస్ మూడో వేవ్ కారణంగా ఇప్పటికే అనేక చిత్రాలు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ జాబితాలోకి తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ వచ్చి చేరింది. కరోనా కారణంగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలు వాయిదా పడ్డాయి. కాగా మేజర్ సినిమాకు గాను త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో దేశంలో చాలా చోట్ల కోవిడ్ ఆంక్షలు, కఠిన నియమాలు ఉన్నాయి. అందువల్ల మేజర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. మేజర్ సినిమాను భారతీయ సినీ ప్రేక్షకుల కోసం తీశాం. అందువల్ల దేశంలో పరిస్థితులు చక్కబడ్డాకే మూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక అప్పటి వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. కరోనా నుంచి సురక్షితంగా ఉండండి.. అంటూ చిత్ర యూనిట్ ఒక ప్రకటనను విడుదల చేసింది.
కాగా మేజర్ మూవీని పలు యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్నారు. 2008లో ముంబై దాడుల్లో ఆత్మత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అడివి శేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. శశి కిరణ్ తిక్క ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సంస్థలు సహ నిర్మాణ బాధ్యతలను వహిస్తున్నాయి. ఇక త్వరలోనూ ఈ మూవీ విడుదలకు సంబంధించి కొత్త తేదీని ప్రకటించనున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…