Posani : పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్ల దాడి అనంతరం పోసాని సంచలన వ్యాఖ్యలు..

September 30, 2021 5:01 PM

Posani : గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో భాగంగా వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అటు వైసీపీ నాయకులు, ఇటు పోసాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిని టార్గెట్ చేస్తూ గత మూడు రోజుల నుంచి ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Posani : పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్ల దాడి అనంతరం పోసాని సంచలన వ్యాఖ్యలు..
Posani

పవన్ కళ్యాణ్ అన్న మాటలకు తప్పులేదు కానీ తను మాట్లాడిన మాటలకు తప్పు ఉందా అంటూ పోసాని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో అలా తనపై పవన్ అభిమానులు దాడికి దిగారని అన్నారు. ఏకంగా తన ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారన్నారు. తన ఇంటిపై దాడి అనంతరం మరోసారి పవన్ కళ్యాణ్ పై పోసాని నిప్పులు చెరిగారు.

పవన్ కళ్యాణ్ అన్న మాటలకు మెగాస్టార్ చిరంజీవి ఆ వ్యాఖ్యలను ఖండించ వచ్చు కదా అంటూ.. ఈ సందర్భంగా పోసాని అన్నారు. 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నానని. ఇలాంటి బెదిరింపులకు, దాడులకు తను ఏమీ భయపడనని.. పవన్ కళ్యాణ్ ను తానే చెప్పుతో కొడతా అని, మహా అయితే ఏం చేస్తారు ? చంపేస్తారా.. అభిమానులకు డబ్బులు ఇచ్చి నా పై దాడికి ఉసిగొల్పడం ఏంటి ? అని ఈ సందర్భంగా పోసాని ప్రశ్నించారు. రాజకీయంగా తనను ఏమన్నా పట్టించుకోను.. కానీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ.. ఈ సందర్భంగా పోసాని మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now