Poonam Kaur : సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రతి విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ ఎన్నికలో గెలుపోటములపై స్పందించిన పూనమ్ తాజాగా ఈటెల రాజేందర్‌ను కలిశారు. అలాగే తెలుపు రంగు దుస్తులను ధరించి శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు.
గురునానక్ జయంతి సందర్భంగా ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన కానుకను సమర్పించడమే కాకుండా ధర్మ యుద్ధమే గెలుస్తుంది.. అంటూ రాజేందర్ గెలుపుపై స్పందించారు. ఇలా ఈమె రాజేందర్‌ను కలవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పూనమ్ బీజేపీలో చేరనుందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో స్నేహం కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ ఈటెలను కలవడం ఆసక్తికరంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…