Pooja Hegde : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. ఆచార్య. ఈ మూవీలో రామ్ చరణ్ తేజ గెస్ట్ రోల్ చేస్తుండగా.. ఆయన సరసన పూజా హెగ్డె నటిస్తోంది. అయితే పూజా హెగ్డె జన్మదినం కావడంతో చిత్ర యూనిట్ ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
ఆచార్య సినిమాలో పూజా హెగ్డ్ లుక్ పోస్టర్ వైరల్‌గా మారింది. అందులో ఆమె లంగావోణీ ధరించి అచ్చమైన పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే పోస్టర్‌ను విడుదల చేసిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది.
ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి చెందిన పోస్టర్స్, టీజర్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. తరువాత సంక్రాంతికి రిలీజ్‌ను ప్లాన్ చేశారు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి మూవీ విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఆచార్య మూవీని ఫిబ్రవరి 4, 2022వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…