Pooja Hegde : ఆచార్య మూవీలో పూజా హెగ్డె లుక్‌.. అదిరిపోయింది..!

October 13, 2021 6:08 PM

Pooja Hegde : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం.. ఆచార్య‌. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ తేజ గెస్ట్ రోల్ చేస్తుండ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న పూజా హెగ్డె న‌టిస్తోంది. అయితే పూజా హెగ్డె జ‌న్మదినం కావ‌డంతో చిత్ర యూనిట్ ఈ మూవీలో ఆమె పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Pooja Hegde in acharya movie look amazing

ఆచార్య సినిమాలో పూజా హెగ్డ్ లుక్ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. అందులో ఆమె లంగావోణీ ధ‌రించి అచ్చ‌మైన ప‌ద‌హారణాల తెలుగుమ్మాయిలా క‌నిపిస్తుండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ.. ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది.

ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగర్వాల్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీకి చెందిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్‌, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయాల‌నుకున్నారు. త‌రువాత సంక్రాంతికి రిలీజ్‌ను ప్లాన్ చేశారు. కానీ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి మూవీ విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆచార్య మూవీని ఫిబ్ర‌వ‌రి 4, 2022వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now