Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డె ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డె గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించగా.. ఈ సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది.
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం బీస్ట్. ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయికగా నటించింది. ఈ సినిమాపై అమ్మడు భారీ హోప్స్ పెట్టుకుంది. ఏప్రిల్ 13న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా దళపతి రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో డైరెక్టర్ సెల్వరాఘవన్ – యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
అంతా బాగానే ఉంది కానీ ట్రైలర్‌లో పూజాని మెరుపు తీగలా చూపించారు. టాప్ హీరోయిన్‌గా ఉన్న పూజాకి కనీసం కొంత స్పేస్ ఇవ్వకపోవడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. దాదాపు 3 నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌లో ఒకే ఒక్క షాట్, ఒకే ఒక్క సెకన్ పూజా హెగ్డె కనిపించడంతో ఎంత దారుణం అని కామెంట్స్ చేస్తున్నారు. పేరుకే ఇందులో హీరోయిన్ ఉందని ఇట్టే చెప్పేసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఏ చిన్న అప్‌డేట్ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతలా విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 255 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ జాలియా జింఖానా కూడా భారీ వ్యూస్ ను సాధిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…