Pelli Sandadi : ‘మ‌ధురా న‌గ‌రిలో’ పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న‌.. 11 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ తో ట్రెండింగ్‌..

September 30, 2021 5:41 PM

Pelli Sandadi : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాల్లో వ‌చ్చే పాట‌ల‌కు అభిమానులు ఫిదా అవుతుంటారు. పాట‌లు లేక‌పోతే సినిమా చూసిన ఫీలింగ్ రాదు. పాట‌ల ద్వారానే హిట్ అయిన చిత్రాలు అనేకం ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కుతున్న పెళ్లి సంద‌D చిత్రానికి చెందిన పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సినిమాకు హిట్ ఇచ్చేలా నిలుస్తోంది.

Pelli Sandadi : 'మ‌ధురా న‌గ‌రిలో' పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న‌.. 11 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ తో ట్రెండింగ్‌..
Pelli Sandadi

రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రోష‌న్‌, శ్రీ‌లీల హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం పెళ్లి సంద‌D. ఇందులో ‘మ‌ధురా న‌గ‌రిలో’ అనే సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 29వ తేదీన రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ పాట‌కు చెందిన లిరిక‌ల్ వీడియో ట్రెండ్ అవుతోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే 11 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది.

కాగా పెళ్లి సంద‌D సినిమాను ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, అర్కా మీడియా వ‌ర్క్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని అక్టోబ‌ర్ 15వ తేదీన విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మ‌రి పాట‌తో అల‌రిస్తున్న ఈ మూవీ హిట్ అవుతుందా, లేదా.. అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now