Pawan Posani : చ‌ట్ట బ‌ద్ధంగా ముందుకు సాగే వీలు ఉన్న‌ప్పుడు బూతులు మాట్లాడ‌డం ఎందుకు ?

Pawan Posani : ప్ర‌జా స్వామ్యంలో ఎవ‌రికైనా స‌రే వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అంటే.. మాట్లాడే స్వేచ్ఛ అన్న‌మాట‌. ఎవ‌రైనా సరే త‌మ అభిప్రాయాల‌ను ఏ వేదిక‌పై అయినా స‌రే పంచుకోవ‌చ్చు. అయితే త‌మ అభిప్రాయాల‌ను పంచుకోవ‌డం ద్వారా ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌కూడ‌దు. అది ప్రాథ‌మిక సూత్రం. ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, త‌మ‌పై దాడి జ‌రుగుతుంద‌ని, త‌మ‌ను చంప‌బోతున్నార‌ని భావిస్తే అందుకు చ‌ట్టాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ ఉన్నాయి. ఆ విధంగా పోరాటం చేయాలి. కానీ వాక్ స్వాతంత్య్రం ఉంది క‌దా అని చెప్పి ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఏదంటే అది మాట్లాడితే కుద‌ర‌దు.

ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల్లోనూ కొంద‌రు హ‌ద్దులు మీరి మాట్లాడారు. అది వాస్త‌వ‌మే. వారిలో ఉన్న ఆగ్ర‌హావేశాలు కావ‌చ్చు, మ‌రో విష‌యం కావ‌చ్చు. కానీ వాక్ స్వాతంత్య్రం సేరిట ఎవ‌రి మనోభావాల‌ను దెబ్బ తీయ‌రాదు. ఎవ‌రి ప్ర‌తిష్ట‌కూ భంగం క‌లిగించ‌రాదు. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని అనిపిస్తే పోలీస్ స్టేష‌న్ లో కేసు వేసి లేదా కోర్టులో పిటిష‌న్ వేసి తేల్చుకోవ‌చ్చు. అంతేకానీ.. తిట్ల దండ‌కం కూడ‌దు. అది సెల‌బ్రిటీల‌కే కాదు, ఎవ‌రికైనా స‌రే మంచిది కాదు.

అయితే ప‌వ‌న్ వ‌ర్సెస్ వైసీపీగా ఉన్న కోల్డ్ వార్, ప‌వ‌న్ వ‌ర్సెస్ పోసానిగా మారింది. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన మంత్రి పేర్ని నానిని ప‌వ‌న్ స‌న్నాసి అన‌డం న‌చ్చ‌లేద‌ని చెప్పి పోసాని ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప‌వ‌న్‌ను తిట్టారు. అయితే విమ‌ర్శ‌ల వ‌ర‌కు ఓకే. కానీ పోసాని అలాంటి భాష‌ను మాట్లాడ‌డం త‌గ‌ద‌ని సాక్షాత్తూ వైసీపీ నేత‌లే అంగీక‌రిస్తున్నారు. మంత్రి పేర్నినాని ప‌వ‌న్ తిట్టార‌ని అనుకుంటే.. పోసాని రివ‌ర్స్‌లో ప‌వ‌న్‌ను తిట్ట‌డం ఎందుక‌న్న‌ది ప్ర‌శ్న‌. పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్ట‌వ‌చ్చ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. అంతేకానీ.. వివాదంలో లేని కుటుంబ స‌భ్యుల‌ను వివాదంలోకి లాగి మరీ తిట్ట‌డం ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు.

ఇక ప‌వ‌న్ త‌న‌కు రాజ‌కీయ ప‌రంగా వైసీపీ శ‌త్రువే అయినా ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంతో డైరెక్ట్ గా పోరాటం చేయాల‌ని, హైద‌రాబాద్‌లో ఉండి, అదీ.. ఒక సినిమా వేడుక వేదిక‌పై రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఉండే వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని.. విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ నిజానికి పోసానిలా బూతులు మాట్లాడ‌లేదు. కానీ రెండో సారి మంగ‌ళ‌గిరిలో మాత్రం దాదాపుగా ఆ విధంగానే మాట్లాడారు. అయితే ఎవ‌రైనా స‌రే త‌న ప్ర‌తిష్ట‌కు, ప‌రువుకు భంగం క‌లిగింద‌ని భావిస్తే కోర్టులో కేసు వేయ‌వ‌చ్చు. ఆ విధంగా చ‌ట్ట బ‌ద్ధంగా ముందుకు సాగితే హుందాగా ఉంటుంది. పోసాని అయినా ప‌వ‌న్ అయినా.. ఆ విధంగా పోరాటం చేయ‌వ‌చ్చు. కానీ పోసాని త‌ను అన్నాడ‌ని ప‌వ‌న్‌, ప‌వ‌న్ త‌నను అన్నార‌ని పోసాని.. లేదా ప‌వ‌న్ అభిమానులు పోసానిని.. తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించ‌డం హుందాగా ఉండ‌దు.

ఉత్త‌రాదిలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు అడ‌పా ద‌డ‌పా జ‌రుగుతూనే ఉంటాయి. నేత‌లైతే ఇలా ఎదురు దాడి చేసి తీవ్ర ప‌దజాలంతో దూషించ‌రు. కోర్టులలోనే తేల్చుకుంటారు. ఆ విధంగా ముందుకు సాగితే ఆరోగ్య‌క‌ర‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంటుంది. లేదంటే.. ఎప్ప‌టికీ ఇలాగే జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM